వాటికన్ సిటీలో మంగళవారం నాటికి నాలుగు కరోనా కేసులు నమోదు అయినట్లు హోలీ సీస్ ప్రెస్ ఆఫీస్ తెలిపింది. దీనిలో మార్చి 6న ప్రకటించిన మొదటి కేసుతో సహా మొత్తం నాలుగు కేసులు అని, వీరందరికీ ఇటలీలోని ఆసుపత్రుల్లో వైద్యం అందిస్తున్నట్లు హోలీ సీస్ ప్రెస్ ఆఫీస్ డైరెక్టర్ మాటియో బ్రూని మంగళవారం విలేకరులకు తెలిపారు. కొత్త కేసులలో వాణిజ్య కార్యాలయ ఉద్యోగి, వాటికన్ మ్యూజియానికి చెందిన ఇద్దరు ఉద్యోగులు ఉన్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా యూనివర్సరల్ చర్చికి సంబంధించిన కార్యక్రమాలను సాధ్యమైనంత తక్కువ సిబ్బందితో, తగు జాగ్రత్తలు తీసుకుని నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ఇటలీలో కరోనావైరస్ లాక్‌డౌన్నడుస్తున్న సమయంలో రోమ్ బిషప్ పోప్ ఫ్రాన్సిస్ సాధారణ షెడ్యూల్ ప్రకారం ఉదయం మాస్, బుధవారం జనరల్ ఆడియన్స్, సండే ఏంజెలస్ వంటివి నిర్వహిస్తున్నారు.