న్యూఢిల్లీ: 2020 బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కాసేపట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మాంద్యం ఏర్పడిన అనంతరం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కావడంతో దేశ ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ బడ్జెట్ ఎలా ఉండబోతోంది!? వరాల బడ్జెట్ ఉంటుందా!? వాతల బడ్జెట్ ఉంటుందా!? ఇలాంటి ప్రశ్నలు అందరిలోనూ ఆసక్తి రేపుతున్నాయి. బడ్జెట్‌లో పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట కలిగించే అవకాశాలున్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
2020 బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం